కొత్త గవర్నర్‌కు స్వాగతం పలికిన ఎంపీ సంతోష్‌..

234

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్ ఆదివారం ఉదయం గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈరోజు ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు, బీజేపీ నేతలు తదితరులు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.

cm and governar

అలాగే మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. వీరందరినీ సీఎం కేసీఆర్ గవర్నర్‌కు పరిచయం చేశారు. పోలీసులు ఆమెకు గౌరవ వందనంతో స్వాగతం పలికారు.

mp santhosh