మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం..

306
Telangana Municipal Elections

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి ఊపందుకుంది. జనవరి 22న పోలింగ్‌కు ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో రేపు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 50 లక్షల మందికి పైగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబీర్‌పురా డివిజన్‌కు ఉపఎన్నిక జరుగుతోంది.

మొత్తం కార్పొరేషన్లలో 325 డివిజన్లకుగాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా పురపాలికల్లోని 2,727 వార్డుల్లో 80 ఏకగ్రీవమయ్యయి. 45 వేల మంది సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. ఎన్నికల సిబ్బంది ఈ సాయంత్రానికి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అధికారులు బుధవారం సెలవు ప్రకటించారు.జనవరి 22న ఎన్నికల పోలింగ్.. 25న ఫలితాల ప్రకటన వెల్లడికానుంది