మున్సిపల్ చట్టం -2019కు అసెంబ్లీ అమోదం..

517
pocharam
- Advertisement -

పారదర్శకతకు పెద్దపీట వేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం సభ బిల్లుకు అమోదం తెలిపింది.

మున్సిపల్ బిల్లుపై సలహాలు,సూచనలు ఇచ్చిన సభ్యులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చట్టంలో మార్పులు,చేర్పులు చేయకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయని సీఎం చెప్పారు.ఇవే లంచాలు కొనసాగాలా అని ప్రశ్నించిన సీఎం… ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపడుతుంటే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతలు ప్రతి అంశాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ల చేతిలో నియంత్రణ మాత్రమే పెట్టాం,వారికి పూర్తి అధికారాలు ఇవ్వలేదన్నారు.ఇలాంటి చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తే ప్రజలకు ఓ బలమైన సందేశం ప్రజలకు అందుతుందన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధుల అధికారాలను హరించాలన్నది మా ఉద్దేశం కాదు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అనేక మంది మేధావులు ఫోన్ చేసి చట్టం బాగుందని చెప్పారని తెలిపారు సీఎం.

- Advertisement -