వ్యవసాయ విధానంపై హాకా భవన్‌లో మంత్రుల రివ్యూ

441
errabelli
- Advertisement -

హైదరాబాద్ హాకాభవన్ లో వ్యవసాయ విధానం మీద జరిగినమంత్రి వర్గ ఉప సంఘ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ , విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి , పౌరసరపరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ , పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

ఉత్తమ వ్యవసాయ విధానం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ  ప్రజల ఆహార అవసరాలు , ఉత్పత్తులు , ప్రాసెసింగ్ , సీడ్ డిస్టిబ్యూషన్ , ఎరువులు , మద్దతుధర , కొనుగోళ్ల అంశాలపైచర్చించామని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు.  రాష్ట్ర అవసరాలను గుర్తించి దానికిఅనుగుణంగా పంటల సాగును ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు.

ఆ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనిమంత్రివర్గ ఉపసంఘం నియమించారని చెప్పారు. ఆహార అవసరాలకు తగినట్లుగా పంటలసాగుపెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది..  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పండేపంటలను గుర్తించి అవసరాలకు అనుగుణంగా పంటకాలనీలు ఏర్పాటుచేశామన్నారు.

ఉత్పత్తులు , ఫుడ్ ప్రాసెసింగ్ ,డిస్ట్రిబ్యూషన్ లపైఉత్తమ విధానం రూపొందించేలా సూచనలు చేశారు. ఉల్లి విషయంలో రైతులకు మద్దతుధర ఇచ్చిప్రోత్సహిస్తే ప్రస్తుత పరిస్థితి రాదన్నది యోచన దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ కి నివేదించి నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఇతర రాష్ట్రాలనుండి దిగుమతి చేసుకోవడంవలన అధికధరల సమస్య వస్తుందన్నారు.

మన రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తులు నిలువ ఉంటేవిజిలెన్స్ తనిఖీలతో చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇతర రాష్ట్రాలలో మనం తనిఖీలు చేసేపరిస్థితి లేదు ఉల్లి విత్తనాలను అన్ని విత్తనాల మాదిరేసబ్సిడీ మీద ఇవ్వాలని భావిస్తున్నాం అన్నారు. మద్దతుధర నిర్ణయిస్తే రైతులు ధైర్యంగాసాగుచేస్తారు ప్రస్తుతం అధికధర ఉన్నప్పుడుసాగుచేస్తున్నారు .. ధర లేనప్పుడు సాగు మానేస్తున్నారని చెప్పారు.

ఖరీఫ్ కు సంబందించిన రైతుబంధు డబ్బులవిడుదల 93 శాతం పైగా పూర్తయిందిదని…హాకాభవన్ లో వ్యవసాయ విధానం మీద జరిగినమంత్రి వర్గ ఉప సంఘ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గారు, ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ గారు, విద్యుత్ శాఖా మంత్రిజగదీశ్ రెడ్డి గారు, పౌరసరపరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ గారు, పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిపార్ధసారధి గారు, కమీషనర్ రాహుల్ బొజ్జ గారు,వివిధ శాఖల ఉన్నతాధికారులు కేశవులు, లక్ష్మీభాయి, భాస్కరాచారి, పౌసమి బసు, అఖిల్  తదితరులు పాల్గొన్నారు. 10 రోజుల తరువాత  తదుపరి సమావేశంఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

- Advertisement -