సిద్దిపేటలో హజ్ హౌస్‌ను ప్రారంభించిన హోంమంత్రి..

407
Home Minister Mahmood Ali
- Advertisement -

నేడు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో హజ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, సిద్దిపేట ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. దేశంలోనే జిల్లా కేంద్రంలో ఎక్కడా హజ్ హౌస్ నిర్మాణం కాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో హరీష్ రావు గొప్పగా సిద్ధిపేటలో హజ్ హౌస్‌ను నిర్మింపజేశారు.వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షిస్తాం..అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని ముస్లిం వర్గాల కోసం వినియోగిస్తామని మహమూద్‌ అలీ అన్నారు.

సిద్ధిపేట నియోజకవర్గం అన్ని రంగాలలో ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలో టీఆర్‌ఎస్ పార్టీ ఒక్కటే నిజసమైన సెక్యులర్ పార్టీ.తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపట్టిన కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ లాంటివి సెక్యులరిజాన్ని ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం చేశారు తప్ప అమలు చేయలేదని మంత్రి తెలిపారు.

పేద ముస్లిం యువతుల పెళ్లిళ్లకు షాదీముబారక్ వంటి గొప్ప పథకాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారు.ముస్లిం వర్గాల సంక్షేమం కోసం 2000 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదు. కేటీఆర్ పుట్టినరోజున హరీష్ రావు సిద్దిపేటలో హజ్ హౌస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది.హైద్రాబాద్ లో 14 కోట్లతో ముస్లింల కోసం భవనాన్ని నిర్మింపజేసిన ఘనత కేసీఆర్ దే. హరీష్ రావు లా పనిచేసే నాయకుడు సిద్ధిపేటకు ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం అని మహమూద్‌ అలీ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ..ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది.కేసీఆర్ వేసిన దారిలో మేము నడుస్తున్నాం.సిద్దిపేటలో మొట్టమొదట షాదీఖానాను కేసీఆర్ నిర్మించారు.ఆ దారిలోనే ఇప్పుడు మొట్టమొదటి హజ్ హౌస్‌ను సిద్దిపేటలో నిర్మించామని హరీష్‌ అన్నారు.సిద్దిపేటలో మొట్టమొదటి ఆఖరీ సఫర్ వాహనాన్ని ప్రారంభించాం.మహమూద్ సాబ్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగులో అడుగు వేసి నడిచారు.ఇవ్వాళ్ళ హోం మంత్రి పదవిలో ఉన్నారు.ఇది ముస్లిం వర్గాలకు గర్వకారణమన్నారు.

సిద్దిపేటలో,తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం ప్రజలు ఎల్లప్పుడూ సోదర భావంతో మెలిగారు..ఆ సంస్కృతి కొనసాగాలి. సిద్ధిపేట హజ్ హౌస్‌ను ముస్లింల సేవా కేంద్రంగా మార్చాలని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని సదుపాయాలు కల్పించాలి..హజ్ హౌస్ ఫర్నీచర్ కోసం 5 లక్షలు నా సొంతంగా అందిస్తానని అన్నారు.కేసీఆర్ ముస్లిం విద్యార్థుల కోసం 204 మైనార్టీ రేషిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించారు. అలాగే ముస్లింలలో పేదరికం చదువు ద్వారానే పోతుంది.ఈ పాఠశాలలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని హరీష్‌ రావు అన్నారు.

ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.. 49 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశా..కేసీఆర్, హరీష్ రావు లాంటి నాయకులను నేను సిద్ధిపేటలో చూడ లేదు. మనసులో ఏముందో వారిద్దరూ అదే చేస్తారు.కేసీఆర్ మొదటి నుండీ కులాలకు,.మతాలకు అతీతంగా పనిచేశారు. ముస్లిం వర్గాల ను తన సోదరుల మాదిరిగా చూసారు.అదే ఒరవడిని హరీష్ రావు కొనసాగిస్తున్నారు.

పేద ముస్లిం పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించిన ఘనత కేసీఆర్ ది. రాష్ట్రంలో మొట్టమొదట చింతమడక గ్రామంలో ఇఫ్తార్ పారీ ప్రారంభిచిన ఘనత కెసిఆర్ ది.అది ఇవ్వాళ్ళ దేశమంతా విస్తరించింది.హరీష్ రావు లా 18 ఘంటలు పనిచేసే నాయకుణ్ణి నేను ఎక్కడా చూడ లేదు.అని అన్నారు.

- Advertisement -