గూగుల్ కంపెనీపై హైకోర్టు సీరియస్..

395
telangana-high-court
- Advertisement -

ప్రముఖ సాఫ్ట్ సంస్ధ గూగుల్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. పోర్న్ సైట్లను కట్టడి చేయడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ గూగుల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు ఆ సంస్ధకు నోటిసులు జారీ చేసింది. ఫేస్ బుక్ లో ఉన్న తన ఫోటోలు, పేరును తీసుకోని పలు పోర్న్ సైట్లలో పెడుతున్నారంటూ ఓ యవతి ఇటివలే హైకోర్టును ఆశ్రయించింది.

దీంతో ఇవాళ ఈకేసును విచారించింది హైకోర్టు. గతంలో కొన్ని సార్లు గూగుల్ కంపెనీకి వెళ్లి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆయువతి కోర్టుకు తెలిపింది. యువతి వాదన విన్న కోర్టు గూగుల్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోర్న్ వెబ్‌సైట్‌లు రూపొందిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గూగుల్‌ను ప్రశ్నించింది.

పోర్న్ సైట్లను కట్టడి చేయలేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టి, అశ్లీల సైట్లు రూపొందించే వారికి సంబంధించి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.

- Advertisement -