స్వచ్చ్ మహోత్సవ్ 2019లో మెరిసిన తెలంగాణ..

669
Swachh Mahotsav 2019
- Advertisement -

కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో శాఖ స్వచ్ఛ్‌మహోత్సవ్ 2019 కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వివిధ విభాగాల్లో రాష్ట్రాలకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అవార్డులు అందించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి ఐదు అవార్డులు దక్కాయి. ప్రత్యేక వ్యక్తిగత విభాగంలో సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లికి చెందిన భిక్షపతికి, జగిత్యాల జిల్లా శాంతక్కపల్లికి చెందిన రమకు, జిల్లా స్థాయిలో మూడోస్థానంలో, దక్షణాదిలో ప్రథమస్థానంలో పెద్దపల్లి జిల్లా నిలిచింది.

రాష్ట్రస్థాయి అవార్డును పంచాయతీరాజ్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ అందుకున్నారు. జిల్లాస్థాయి అవార్డును పెద్దపల్లి కలెక్టర్ దేవసేన అందుకున్నారు. జిల్లాల ప్రత్యేక విభాగంలో వరంగల్‌కు అవార్డు లభించింది. శౌచాలయాల నిర్మాణం, పరిశుభ్రత అంశాలు పరిగణలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశారు.

అవార్డుల ప్రధానం అనంతరం నీతూ కుమారి ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలోనే స్వచ్ఛ సుందర శౌచాలయ పురస్కారాల్లో రాష్ట్రం రెండో స్థానంలో నిలవడం గర్వంగా ఉంది.98 శాతం ఓడీఎఫ్ సాధించి.. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో 100 శాతం బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అమె అన్నారు.తెలంగాణ పని తీరుకు వచ్చిన అవార్డులే నిదర్శ నం.స్వచ్ఛ దర్పణ లక్ష్యంగా పని చేస్తున్నాం. సిఎం కేసీఆర్ అదేశాలతో రాష్ట్రాన్ని స్వచ్చతా విషయంలో జాతీయ స్థాయిలో నిలిపామని నీతూ కుమారీ ప్రసాద్‌ తెలిపారు.

ఇక దేవసేన మాట్లాడుతూ.. దేశంలోనే పెద్దపల్లి జిల్లా స్వచ్ఛ భారత్ కి ఆదర్శంగా నిలుస్తుంది. స్వచ్ఛ సర్వేక్షన్ పురస్కారాల్లో దేశంలో మూడో స్థానం, దక్షిణ రాష్ట్రాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అక్టోబర్ 2న జరిగే మహాత్ముని150వ జయంతిలో పెద్దపల్లి జిల్లా ముందు ఉంటుందనిపెద్దపల్లి కలెక్టర్ దేవసేన అన్నారు.

- Advertisement -