మొక్కలు నాటిన ఛీప్ విప్, ఎమ్మెల్సీ పోచంపల్లి

479
Pochampalli
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. బిగ్ బాస్3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్. అనంతరం వరంగల్ పశ్చిమ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ రవిందర్,రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వేంకటేశ్వర్లు కి ఛాలెంజ్ విసిరారు.

మరోవైపు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. హన్మకొండలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి సవాల్ విసిరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ కి ఛాలెంజ్ విసిరారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.

ఈసందర్భంగా ఛీప్ విప్ దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. హరిత తెలంగాణకు పాటు పడాలని సూచించారు.

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడూతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కి అపూర్వ స్పందన లభిస్తుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లోకి వ్యాపించింది. ప్రతి ఒక్కరు హరిత యజ్ఞం లో పాల్గొనాలని తెలిపారు.

- Advertisement -