వాటర్ కన్జర్వేషన్ కు ప్రభుత్వం పెద్దపీట: సీపీ

453
Cp Mahesh Bhagavath
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం వాటర్ కన్జర్వేషన్ కు పెద్దపీట వేస్తుందన్నారు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్. తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ అహ్మద్ నగర్ జిల్లా లోని హివరే బజార్ గ్రామాన్ని నందనవనంగా తీర్చిదిద్దిన మహనీయుడు పొపట్ రావు పవార్ అనుభవాలపై తెలంగాణ రిటైర్డ్ ఇంజనిర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాటర్ కన్జర్వేషన్ ,మేనేజ్మెంట్ హివరే బజార్ గ్రామా మెడల్ పై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి పోపట్ రావు, జలవనరుల అభివృద్ధి కార్పోరేషన్ శాఖ చైర్మన్ వి ప్రకాష్ రావు ,రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్,రిటైర్డ్ ఇంజనిర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి,ఇతర ఇంజనీర్లు హాజరయ్యారు.

ఈసందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. పొపట్ రావు పవార్ చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి, ఆయన పీజీ చదువుతున్న కాలంలో యాక్సిడెంట్కు గురయ్యారు. ఆ తరువాత ఆయన గ్రామంలో నీటి ఎద్దడి పై అనేకసార్లు ఆలోచన చేశారు.ఊరికి ఏదైనా చెయ్యాలని తపన పాడారు ఆ తరుణంలోనే వాటర్ కన్జర్వేషన్ పై దృష్టి సారించారు. ఆయన చేసిన కన్జర్వేషన్ ఎన్నో ఫలితాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ గ్రామం దేశానికి ఆదర్శంగా నిలిచింది. పూణే నుండి ముంబై వలస వెళ్లిన వారు తిరిగి మళ్ళీ స్వగ్రామం లకు వచ్చారు. గతంలో హైదరాబాద్ వచ్చిన సమయంలో మన సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కలిశారు సీఎం కేసీఆర్ పొపట్ రావు ను అభినందించారు. పోపాట్ రావు పవార్ లాంటి వ్యక్తి నాకు పరిచయం ఉండడం సంతోషంగా ఉందన్నారు.

జల వనరుల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ వి ప్రకాశ్ మాట్లాడుతూ.. ఒక్క నిర్ణయమే దేశాన్ని మారుస్తుంది. గ్రామాన్ని అన్ని విధాలా మార్చిన గొప్ప వ్యక్తి పొపట్ రావు పవార్. గ్రామంలో నీటి ఎద్దడి ఒక్కటే కాదు దోమల నివారణ అనేక కార్యక్రమాలు చేశారు. ప్రతి ఒక్కరు హివేరీ బజార్ వెళ్ళాలి ,అక్కడ జరిగిన ప్రతి కార్యక్రమం చూడాలి. ఆ గ్రామానికి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా అనుమతి లేదు. పొపట్ రావు కు ఎంపీ ఇస్తాం అని అన్నారు ఆయన ఉప సర్పంచ్ పదవి మాత్రమే కావాలి అన్నారు. హివేర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మహారాష్ట్ర ప్రభుత్వం 7000 గ్రామాలు అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి భారత రత్న ఇచ్చిన తక్కువే కానీ కేంద్ర ప్రభుత్వం అతడిని తక్కువగా చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

పవార్ చేంజ్ మేకర్ ఆఫ్ రూరల్ ఇండియా పొపట్ రావు పవార్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాలు అభివృద్ధి చెందాలి.18 సంవత్సరాల కాలంలో మా గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం.గ్రామంలో ముక్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది. మా గ్రామంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగి కూడా వచ్చే వారు కాదు.మా గ్రామం నుండి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు కానీ ఇప్పుడు మొత్తం మా గ్రామానికి తిరిగి వచ్చారు. మా జిల్లాలో తక్కువ వర్షపాతం ఉంటుంది1989 లో గ్రామంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు కోసం గ్రామ సభ పెట్టాం.మొదటగా వాటర్ షేడ్ పోగ్రామ్ చేశాం,చెట్ల పెంపకం,చేక్ డ్యామ్ ల నిర్మాణం,పశువుల పెంపకం చేశాం.ఇప్పుడు గ్రామంలో 80 శాతం నీటి లభ్యత ఉంది.40 నుండి 50 ఫీట్ల లోతులో మా గ్రామంలో వాటర్ లభ్యత ఉందన్నారు. మా గ్రామానికి అనేక మంది ప్రముఖులు వస్తారు మా గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు స్టడీ చేస్తారు.
మేము చేసిన వాటర్ కన్జర్వేషన్ వలన సంవత్సరం లో 3 పంటలు పండుతున్నాయి. వేసవి కాలంలో మాకు త్రాగు ,సాగు నీటి ఎద్దడి ఉండదు.మా గ్రామంలో ప్రతి ఇంట్లో బయో గ్యాస్ ఉంటుంది. రెగ్యులర్ గా గ్రామ సభ జరుగుతుంది. ప్రతి విద్యార్థికి అన్నింటి పై అవగాహన కల్పిస్తామని చెప్పారు.

- Advertisement -