రైతులకు అండగా టీఆర్ఎస్: హరీష్‌ రావు

375
harish rao
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్‌లో‌ నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ 2020 జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి హరీశ్ రావుతో పాటు నాబార్డ్ సిజీఎం విజయ్ కుమార్,తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టీఎస్ సిఏబి) చైర్మన్ కొండూరి రవీందర్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్…నాబార్డ్ ఆర్థిక ప్రణాళికలో భాగంగా హైటెక్ అగ్రికల్చర్ కు ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయం,వ్యవసాయ ఆధారిత రంగాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతుల సమస్యలు తెలుసు కాబట్టి రైతుల కోసం ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.

రైతు జీవితం రైతు మీద ఆధారపడి ఉండదు,ఇతరుల మీద ఆదారపడతాడు విత్తనాల దగ్గరనుండి పురుగు మందుల వరకు అన్నిటిమీద ఇతరులపై ఆదారపడతాడు..తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు.

మైక్రో ఇరిగేషన్ విషయం లో నాబార్డు 874 కోట్లు కేటాయించి సహాయం చేసింది ఇందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హరీష్‌. వ్యవసాయం కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో 30 శాతం కేటాయించిందన్నారు. రైతు బంధు కోసం సంవత్సరానికి రైతుకు 10000 రూపాయలు ఇస్తూ 12000 కోట్లు కేటాయిస్తు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇస్తున్నాం అన్నారు.

ప్రతి రైతు కుటుంబానికి 5 లక్షల భీమా సదుపాయం కల్పిస్తున్నాం..రైతు బీమా కింద 1136 కోట్లు కేటాయిస్తున్నాం అన్నారు. తెలంగాణ రాకముందు రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉండే రాష్ట్రం వచ్చాక రైతుకు భరోసా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఉన్నత చదువులు చదివిన పిల్లలు కూడా వ్యవసాయం చేయడానికి ఉత్సహం చూపిస్తున్నారని..వ్యవసాయం దండగ అన్నది ఒకప్పుడు ఉంటే ఇప్పుడు వ్యవసాయాన్ని లాభసాటిగా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.

దేశంలోనే వ్యవసాయం మీద అత్యధికంగా ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రము తెలంగాణ అన్నారు. నీళ్లకోసం 25000కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం.రైతుకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

రెవెన్యు డిపార్ట్మెంట్ డిజిటైలేజషన్ ద్వారా అత్యంత పారదర్శకంగా చేస్తున్నాం.రైతుకు భరోసా కల్పిస్తున్నాం అన్నారు. నాబార్డ్ ,రూరల్ బ్యాంకులు ఇతర నేషనల్ బ్యాంకులు వ్యవసాయము మీద అధిక రుణాలు ఇవ్వాలని కోరారు. తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరిన హరీష్..సర్కార్ చేపడుతున్న పథకాలకు నాబార్డ్ సహకరిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ గోళ్లకురుమల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని.. మత్స్యకారులకు 100శాతం ఉచితంగా చేపల పంపిణీ చేసాం అన్నారు. ఫిషరి రంగంలో కేరళ తర్వాత తెలంగాణ రెండో స్థానములో ఉందన్నారు.

- Advertisement -