రెండో రోజు కొనసాగుతున్న ఎడ్యుకేషన్ ఫెయిర్

401
tnews education fairr
- Advertisement -

విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మార్గదర్శిగా నిలిచే టీన్యూస్, అపెక్స్ తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2019 రెండో రోజు కొనసాగుతోంది.విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున స్టాళ్లను సందర్శించి తమ సందేహాలను నివృత్తి  చేసుకుంటున్నారు.

ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో రాష్ట్రంలోని వివిధ కళాశాలలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఎడ్యుకేషన్ ఫెయిర్ కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వివిధ కాలేజీలు సమాచారాన్ని విద్యార్థులకు అందించనుండగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు ప్రవేశం ఉచితం.

ఎంసెట్‌, ఐసెట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఎలా పాల్గొనాలి.. ఆప్షన్లను ఎలా ఎంపిక చేసుకోవాలనే వివరాలను మాక్ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

ఇంటర్‌ తర్వాత ఇంజినీరింగ్‌ టూ ఎకనమిక్స్‌, ఏరోనాటిక్స్‌ టూ టెక్స్ టైల్స్‌, ఫిజియోథెరపీ నుంచి ఫ్యాషన్‌ అండ్‌ డిజైన్‌, అగ్రికల్చర్‌ టూ లా.. ఇలా ఎన్నో కోర్సుల వివరాలను ఎడ్యుకేషన్ ఫెయిర్ అందిస్తోంది. ఇంటర్‌ తర్వాత ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాకుండా అందుబాటులో ఉన్న ఇతర అన్ని కోర్సులు, కెరీర్‌ సమాచారం కూడా ఫెయిర్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

- Advertisement -