రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

337
gutta sukendar
- Advertisement -

తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్స్ ల వల్ల మంచి నాణ్యమైన విద్య అందుతోంది అన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ ఎస్సీ,ఎస్టీ కమీషన్ సావనీర్,డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,,మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మంత్రులతో పాటు ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,,ఎస్సి డెవెలెప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రాలు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అక్షరాస్యతలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. దేశంలో తెలంగాణ రాష్ట్రం14వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. అగ్రవర్ణాల కులాల వారు ఎస్సి,ఎస్టీ ల మీద దాడులు చేయడం లేదు..వారికి అవగాహన వచ్చింది. ఇంకా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు కమిషన్ పని చేయాలని సలహా ఇస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా క్షేత్ర స్థాయిలో అందుతున్నాయా లేదా అన్నది కూడా చూడాలి.

మంత్రి కొప్పుల మాట్లాడుతూ… గత రెండేళ్లుగా ఎస్సి,ఎస్టీ కమీషన్ ఛైర్మెన్, సభ్యులు గ్రామాల్లో పర్యటన చేసి అద్భుత ఫలితాలు సాధించారు. ఎస్సి,ఎస్టీల కమీషన్ ఆరు వేల గ్రామాలు పర్యటించడం అనేది సామాన్య విషయం కాదు. వారిని నేను అభినందిస్తున్నా. దేశంలోనే ఎక్కడా లేనటువంటి కమిషన్ కార్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కూడా ఎస్సి,ఎస్టీలకు సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు కూడా తీసుకువస్తున్నారు. రెసిడెన్షియల్ ,గురుకులాలు, వసతి గృహాలలో అభివృద్ధి కి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది.

ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాపై ఇంత నమ్మకంగా ఇంత పెద్ద బాధ్యత అప్పగించినప్పటి నుండి సమర్థవంతంగా పని చేస్తున్నాం.ఎస్సి,ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం వారిపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు గ్రామాల పర్యటనలు చేపట్టామన్నారు. ఎస్సి,ఎస్టి ల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందన్నారు.

- Advertisement -