బ్రేకింగ్ న్యూస్.. టీపీసీసీ చీఫ్ గా శ్రీధర్ బాబు?

219
duddilla sridhar babu

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు , నాయకులు ఇతర పార్టీలోకి వెళ్తుండటంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. దీంతో వెంటనే పీసీసీ ప్రక్షాళన చేయాలని భావించింది కాంగ్రెస్ అధిష్టానం. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడంతో సీఎల్పీని టీఆర్ఎస్ లో వీలినం చేశారు. గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమర్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అధిష్టాన దూతలకు వివరించాడట.

ఈ నేపథ్యంలో టీపీసీసీని ప్రక్షాళన చేయ్యాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. త్వరలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి యువ నేతలకు పీసీసీ పగ్గాలు ఇచ్చే ఆలోచనలో ఉంది అధిష్టానం. పీసీసీ రేసులో ముందుగా మాజీ మంత్రి, మంధని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేరు వినిపిస్తుంది. ఆతర్వాత మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఢిల్లీ పెద్దలు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి మరి.