చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయిః కేసీఆర్

269
cm
- Advertisement -

రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గాయ‌న్నారు సీఎం కేసీఆర్. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సిరిసిల్ల-వేములవాడ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డం..ఒక ద‌శ‌లో నేను చావు నోట్లో త‌ల పెట్టి వ‌చ్చాన‌ని చెప్పారు. తెలంగాణ వ‌స్తే రాష్ట్రం చీక‌టైత‌ద‌న్నారు కానీ నేడు 24గంట‌ల క‌రెంట్ ఇస్తున్నాం. దేశంలోనే ఆర్ధిక‌వ్య‌వ‌స్ధ‌లో తెలంగాణ రాష్ట్రం నెం1 స్ధానంలో ఉంది.

kcr

మంచినీటి రంగంలో 11రాష్ట్రాలు మ‌న రాష్ట్రానికి వ‌చ్చి అధ్య‌యనం చేస్తున్నాయి. అలాగే రైతు బంధు ప‌థ‌కం గురించి ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా ప్ర‌శంచిందని చెప్పారు. 2001లో మొట్టమొదట కరీంనగర్ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేశామన్నారు . వ‌చ్చే టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో మ‌హిళా సంఘాలు, ఐకేపీ గ్రూపులు చాలా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఐకేపీ ఉద్యోగులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో పుడ్ ప్రాసెసింగ్ సెంట‌ర్లు ప్రారంభిస్తామ‌ని హామి ఇచ్చారు.

trs

ఉద్యమ సమయంలో సిరిసిల్ల వాసులు తనవెంట ఉన్నారని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నేను క‌ల‌ల క‌న్న తెలంగాణ సాకార‌మ‌వుతుంద‌న్నారు. రైతుల‌కు నీళ్లు వ‌స్తున్నాయి కానీ పండించిన పంట‌కు స‌రైన గిట్టుబాటు ధ‌ర లేదు. రైతు ప‌డించిన పంట‌కు స‌రైన గిట్టుబాటు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. యువ‌నాయ‌కుడు సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్య‌ర్ధి కేటీఆర్ ను ల‌క్ష మెజార్టీతో గెలిపించాల‌ని సిరిసిల్ల ప్ర‌జ‌ల‌కు కోరారు.

- Advertisement -