సీఎం కేసీఆర్ త‌దుప‌రి ప్ర‌చార షెడ్యూల్ వివ‌రాలు..

244
kcr
- Advertisement -

డిసెంబ‌ర్ 7న జ‌రుగ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేపధ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం కేసీఆర్ ప్ర‌చారం ఉంప‌దుకుంది.ఇప్ప‌టికే దాదాపు 70 నియోజ‌వ‌ర్గాల వ‌రకూ ప్ర‌చారాన్ని పూర్తి చేసి చ‌రిత్ర సృష్టించారు. తాజాగా సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించ‌ని త‌దుప‌రి షెడ్యూల్ కూడా విడుద‌ల చేశారు. డిసెంబ‌ర్ 2 నుంచి 4వ తేది వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. చివ‌రి మూడు రోజుల్లో మొత్తం 14స‌భ‌ల్లో ఆయ‌న ప్ర‌సంగించ‌నున్నారు.

kcr

డిసెంబ‌ర్ 2న నాగ‌ర్ క‌ర్నూల్, చేవెళ్ల‌, ప‌టాన్ చెరువు, హైద‌రాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో నిర్వ‌హించే బ‌హిరంగ‌స‌భ‌ల్లో కేసీఆర్ పాల్గోన‌నున్నారు. డిసెంబ‌ర్ 3న సత్తుపల్లి, మధిర, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ లో ప‌ర్య‌టించ‌నున్నారు. డిసెంబర్ 4న అలంపూర్, గద్వాల, మక్తల్, కొడంగల్, వికారాబాద్ లలో నిర్వహించే ప్రచార సభల్లో కేసీఆర్ హాజ‌రుకానున్నారు.

- Advertisement -