నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ

463
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు అమోదం తెలపనున్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని అమోదించడంతో పాటు జీహెచ్‌ఎంసీ చట్టం, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టం, టౌన్‌ప్లానింగ్‌ చట్టాల బిల్లును మంత్రివర్గం ఆమోదించనుంది.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జరుగుతున్న సంప్రదింపుల్లో పురోగతిపై సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొత్త సచివాలయం, శాసనసభ భవనాలు నిర్మిం చాలని గత కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోగా, తాజా భేటీలో సచివాలయ కార్యాలయాల తరలింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

దీంతో పాటుజీఎస్టీ చట్ట సవరణ బిల్లు, రుణ ఉపశమన కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సైతం ఈ సమావేశంలో ఆమోదించనున్నారని తెలుస్తోంది. ఉద్యోగులకు పీఆర్సీ లేదా ఆలోగా మధ్యంతర భృతి చెల్లించాలా? అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.

- Advertisement -