మొక్కలు నాటిన రాష్ట్ర బ్రీడర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్

308
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎం పి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు అనూహ్య స్పందన వస్తుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా జి ఎం వేంకటేశ్వర హ్యాచరిస్ ప్రయివేట్ లిమిటెడ్ కె. జి . ఆనంద్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ హర్షవర్దన్ రెడ్డి. సంతోష్ నగర్ లో ఉన్న వినయ్ నగర్ కాలనీ లో తన ఆఫీస్ వద్ద సిబ్బంది తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో లో పాలు పంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది అన్నారు.

అందరూ ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వామయ్యం కావాలని కోరారు. అందరికి తెలిసినట్టుగా పచ్చదనం అంటే ఆక్సిజన్ అని , అందరూ ఆక్సిజన్ కోసం మొక్కలు నాటలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆనంద్ కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తన స్నేహితులు మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ ను స్వీకరించాల్సాందిగా కోరారు. 1. హరనాథ్ రెడ్డి ( టీ కె ర్ ఇన్స్ట్యూషన్స్) 2. పరశురాం ( ఆర్కిటెక్ట్) 3. విజయ భాస్కర్ ( ఓనర్ ఆఫ్ శ్రీ లక్ష్మీ హ్యాచరీస్) ని ఈ ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు.

- Advertisement -