శాసనసభ 14వ తేదీకి వాయిదా

225
ts Assembly

సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం 2019-20 సంవత్సరానికి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సుమారు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని చదివి వినిపించారు.

రూ. 1,46,492.3 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా పలు రంగాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రం పురోగతి సాధించిందని తెలిపారు.