కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

179
ecnagireddy

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల అధికారి వి.నాగిరెడ్డి. రేపు కౌంటింగ్ జరుగనున్న నేపధ్యంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. నోటిఫికేషన్ ప్రకారం 27వ తేదిన చైర్మన్, మేయర్ ల ఎన్నిక జరుగున్నట్లు తెలిపారు. చైర్మన్ , మైయర్ ల ఎన్నిక పరోక్ష పద్దతితోనే ఉంటుందని అన్నారు.

చైర్మన్, మేయర్ అభ్యర్థుల వివరాలను ఫార్మ్ ఏ, ఫార్మ్ బీ లో వివరాలను ఇవ్వాలి. ఫార్మ్ ఏ 26న ఉదయం 11గంటలలోగా ప్రిసైడింగ్ అధికారికి సమర్పించాలని..అలాగే ఫార్మ్ బీ 27న ఉదయం 10గంటలలోగా అధికారులకు ఇవ్వాలని సూచించారు. రేపటి నుంచి స్పెషల్ మోడ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రానున్నట్లు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికలకంటే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం కొంత తగ్గినట్లు తెలిపారు.