సచివాలయాన్ని సందర్శించిన టెక్నికల్ కమిటీ..

67
Telangana

ఈ రోజు సచివాలయం ప్రాంగణంలోని భవనాలను పరిశీలిండానికి టెక్నికల్ కమిటీ సభ్యులు గణపతి రెడ్డి, ఈఎన్సీ, ఆర్ అండ్ బీ, రవీందర్ రావు, ఈఎన్సీ, ఆర్ అండ్ బీ, మురళీధర్, ఈఎన్సీ ఇరిగేషన్, సత్యనారాయణ రెడ్డి, ఈఎన్సీ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు సచివాలయంను సందర్శించారు.

సచివాలయం ప్రాంగణంలోని 10 భవనాల పరిస్థితిని విశ్లేషించేందుకు వాటిని సందర్శించారు టెక్నికల్ కమిటీ సభ్యులు. అలాగే భవనాల నాణ్యత, వాటి లైఫ్ టైం తదితర ఇతర కోణాల్లో కమిటీ పరిశీలించింది. ఈ పూర్తి నివేదికను త్వరలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కు అందించనున్నారు.