బుమ్రా అరుదైన రికార్డు..

89
bumra

టీమిండియా ఫేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డ్ సాధించాడు. వరల్డ్ కప్ మ్యాచ్ లో భాగంగా నేడు ఇండియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈమ్యాచ్ లో బుమ్రా 2వికెట్లు తీశాడు. దీంతో బుమ్రా వంద వికెట్ల మైలురాయిని చెరాడు. అతి తక్కువ వన్డేల్లో 100 వికెట్లు తీసిన రెండో ఇండియన్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు మహ్మద్ షమి 56 వండేల్లో 100వికెట్లు తీశాడు.

బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అతికొద్ది రోజుల్లోనే టీమిండియా స్టార్ బౌలర్ గా ఎదిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక కు కోలుకోలేని దెబ్బతీశాడు. మొదట కెప్టెన్ కమ్ ఓపెనర్ కరుణరత్నే(10 పరుగులు) ను 17 పరుగుల వద్దే పెవిలియన్ కు పంపించాడు. ఈ వికెట్ ద్వారా బుమ్రా తన కెరీర్లో వందో వికెట్ పడగొట్టాడు. ఇలా వంద వికెట్లు పడగొట్టిన 2 వ ఇండియన్ క్రికెటర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు.