టీడీపీకి షాక్‌.. బీజేపీలో విలీనం కానున్న టీడీపీ రాజ్యసభ పక్షం..

310
TDP
- Advertisement -

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు బీజేపీలోకి జంప్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసిన బీజేపీ ఇప్పుడు ఏపీపై దృష్టి సారించిందా? ఏపీలో తెలుగుదేశం పార్టీలో గట్టి నేతలను లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందా? అంటే రాజకీయ వర్గాలు అవుననే జవాబు చెబుతున్నాయి.

టీడీపీ పార్టీకి భవిష్యత్తు లేదని తలోదారి చూసుకుంటున్న పార్టీకి చెందిన పలువురు ఎంపీలు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ , గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ పార్టీకి రాజీనామా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.

ఇప్పటికే ఈ విషయమై నలుగురు నేతలు బీజేపీ చీఫ్ అమిత్ షాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిని కలిసి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని ఈ నలుగురు సభ్యులు కోరనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

కాగా, మిగిలిన ఇద్దరు సభ్యులు తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్ ను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అధినేత అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వెల్లడించాయి. ఈ బాధ్యతలను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అప్పగించినట్లు పేర్కొన్నాయి.

- Advertisement -