నవంబర్ లో తనీష్ “కంత్రీరాజా”

149
Kantri Raja

నవతరం రీల్స్ పతాకం పై తనీష్ హీరోగా నాగేష్ నారదాసి దర్శకత్వంలో మధు బాబు వెల్లూర్ నిర్మాతగా, నిర్మాణంలో వున్నా చిత్రం “కంత్రీరాజా”.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సారుకు సిద్దమైన ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో రిలీజ్ చేయుటకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సంగీత దర్శకత్వంలో ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయని, లవ్, ఫామిలీ, యాక్షన్, ఎంటర్ టైనర్ గా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని దర్శకులు తెలిపారు.

యాక్షన్ సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గా వుంటాయని ఫైట్ మాస్టర్ నందు తెలిపారు. త్వరలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిపి మే నెలలో రిలీజ్ చేస్తానని నిర్మాత మధు బాబు వెల్లూర్ తెలిపారు. కంత్రీ రాజా యొక్క ప్రోమోస్ యు ట్యూబ్ లో చూడగలరాణి, పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినగలరని నిర్మాత తెలియచేసారు.