అమలాపాల్ ‘ఆమె’..తమ్మారెడ్డి రివ్యూ

226
tammareddy baradwaja

బోల్డ్ కామెంట్స్, హాటో ఫొటో షూట్‌లతో ఎప్పుడు వార్తల్లో ఉండే కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ నటించిన చిత్రం ఆమె. ఈ సినిమా కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా నటించి సంచలనం సృష్టించిన అమలా…టాక్‌ ఆఫ్‌ ది సౌత్ ఇండస్ట్రీగా నిలిచింది.

తమిళ్‌లో ఆడై,తెలుగులో ఆమె పేరుతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకువస్తుండగా ఎమ్.ఆర్ రత్న దర్శకత్వం వహించారు. ఇక ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీకి ట్విట్టర్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కష్టపడి పనిచేస్తే అపజయం అనేదే ఉండదని ఈ చిత్రంతో నిరూపితం అవుతుందని.. అమలాపాల్ చేసిన ఛాలెంజింగ్ రోల్‌ని బట్టి చెప్పేయొచ్చని ట్వీట్లు చేస్తున్నారు.

ఇక ఈ మూవీని తెలుగులో విడుదల చేసిన సినీ దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆమె సినిమా చూసి ఫిదా అయ్యారు. తన 40 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఇలా పెర్ఫామ్ చేసే నటిని ఇంతవరకూ చూడలేదన్నారు. ఇలాంటి కథ చేయాలంటే గట్స్ కావాలన్నారు. ఓ దర్శకుడు పొరపాటున ఇలాంటి కథ చెబితే.. బట్టల్లేకుండా సినిమా చేయమంటారా? అని అడిగే రోజుల్లో.. కథను నమ్మి అమలాపాల్‌ నగ్నంగా నటించడం సినిమా పట్ల ఆమెకు ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు.

సినిమాని విపరీతంగా ప్రేమించగలిగితేనే ఇలాంటి మంచి కథలు వస్తుంటాయి…సినిమా అందరికీ నచ్చుతుంది…పెద్ద హిట్ అవుతుందని చెప్పారు తమ్మారెడ్డి.