స్పీడు పెంచిన రజినీ..మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్

254
Rajinikanths
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యువ హీరోలకు ధీటుగా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితం 2.ఓ మూవీతో హిట్ కొట్టిన ఆయన తాజాగా మరో సినిమాను ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఈమూవీ పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

ఈచిత్రానికి దర్బార్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈసినిమా తర్వాత రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే వాటన్నింటికి భిన్నంగా ఆయన మరో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దర్శకులు కేఎస్ రవికుమార్, వినోత్ లకు రజనీ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

ఈ ఇద్దరూ వినిపించిన కథలు విభిన్నంగా ఉండటం .. ఆ పాత్రలు తాను ఇంతవరకూ చేసినవి కాకపోవడం వలన రజనీ వెంటనే ఓకే చెప్పేశారట. ఈరెండు సినిమాల తర్వాత రజనీ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది.

- Advertisement -