అమ్మ జీవితంలో రెండోసారి చీకటిరోజు…

211
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చాలా రోజుల నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీపావళికి అమ్మ ఇంటికి వస్తున్నారని… అన్నాడీఎంకే నేతలు పెద్ద ఎత్తున సంబంరాలకు సిద్ధమైయ్యారు .. కానీ వారికి నిరాశే మిగిలింది. ఇటీవల తమిళనాడు అపోలో ఆస్పత్రి వైద్యులు జయలలితను దీపావళికి డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపారు కాని అమ్మకు ఇంకా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రిలోనే ఉన్నారు.

online news portal

కాగా, జయలలితకు ఈ దీపావళి రెండో చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆమె జీవితంలో ఎన్నటికి వీటిని మరచిపోలేదు. మొదటిసారి 1971 నాటి దీపావళి. ఆ సమయంలో జయ సినిమా ఇండ్రస్టీలో బిజీస్టార్‌గా వెలుగుతున్నారు. ఆమె తల్లి సంధ్యా తన ముద్దుల కుమార్తె కోసం ఆమెకు చెన్నైలోని రాధా సిల్క్స్‌కు వెళ్లి పది చీరలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చారు. సినిమా షూటింగ్‌ ముగించుకొని ఇంటికి వచ్చిన జయ… తన తల్లి తనకు మాత్రమే 10 చీరలు తెచ్చినందుకు ఓ వైపు సంతోషంలో ఉన్నా, తల్లి కొత్త చీర తీసుకుకొనందుకు అమ్మపై అలిగారు జయ. వెంటనే రాధాసిల్క్స్‌ దుకాణానికి ఫోన్‌ చేసి తన తల్లి కోసం విలువైన పది చీరలను సిద్ధం చేసి ఉంచమని, తానొచ్చి వాటిని ఎంపిక చేసుకుని కొంటానని జయ ఫోన్‌లో చెప్పారు.

online news portal

ఆ తర్వాత జయ తల్లి వద్దంటున్నా వినకుండా కారులో దుకాణానికి వెళ్లి అమ్మకోసం అందమైన పది చీరలను తీసుకతెచ్చారు జయలలిత. జయ మాతృమూర్తి సంధ్య కూడా అలనాటి మేటి నటీమణిగా ఉండేవారు. ఆమె నటిగా ఉన్నప్పుడు జయ తల్లి కోసం రాత్రంతా మేలుకొని ఉండేది. ఆ తర్వాత జయ బిజీ తారగా మారిన తదుపరి తల్లిని కలుసుకునేందుకు సమయం కూడా లేకుండా పోయేది. అందుకనే దీపావళి పండుగ రోజు తన తల్లికి ఒకేసారి పది చీరలు తీసుకొచ్చారు. అయితే దీపావళి నాడు జయ తన తల్లి తీసుకొచ్చిన చీరల్లో మేలైనదానిని ధరించారు. కానీ ఆమె తల్లి సంధ్యా ఎందుకనో జయ తెచ్చిన చీరలను బీరువాలోనే భద్రపరచి పాత పట్టుచీరనే కట్టుకున్నారు. తల్లి కొత్త చీరను కట్టుకోకపోయినా పండుగ సందర్భంగా జయ తన తల్లిపై కోపగించలేదు. మరుసటి రోజు తాను తెచ్చిన కొత్త చీరను ఆమెచేత బలవంతంగా కట్టించలనుకున్నారు. అయితే జయ ఆశ నెరవేరకుండా పోయింది.

online news portal

దీపావళి మరుసటి రోజు సంధ్య తీవ్ర అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకుని అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమె కన్నుమూశారు. తాను ఎంతో ఆశపడి తెచ్చిన చీరను తల్లి మృతదేహంపై కప్పి జయ బోరున విలపించారు. ఆ దీపావళి ఆమె జీవితంలోనే తొలిసారిగా చేదు అనుభవాన్ని మిగిల్చింది. 45 యేళ్ల తర్వాత ఇప్పుడు జయకు దీపావళి మరోమారు చేదు అనుభవాన్ని మిగిల్చింది. జయమ్మ దీపావళి శుభాకాంక్షల కోసం ఎదురు చూసే పార్టీ కార్యకర్తలకు నిరాశను మిగిల్చింది. ఇప్పటికి అమ్మ అపోలో ఆస్పత్రిలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

- Advertisement -