దీపావళికి జయలలిత డిశ్చార్జ్…!

244
- Advertisement -

తమిళ తంబిల ప్రార్థనలు ఫలించాయి. ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. అంతేకాదు, ఈ ఆదివారం ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

జయ అనారోగ్యం నుంచి కోలుకోవడంతో తమకు నిజమైన దీపావళి పండుగేనని తమిళ తంబీలు సంబరపడుతున్నారు. దీపావళి పండుగను జయలలిత అభిమానులతో కలిసి జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ, తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, కేరళ సీఎం పినరై విజయన్‌ ఆకాంక్షించారు.

online news portal

ఇక జయలలిత డిశ్చార్జ్‌ అవుతున్న సందర్భంగా …అపోలో ఆసుపత్రి నుంచి పోయస్‌ గార్డెన్‌లోని సీఎం ఇంటి వరకు ఘన స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు అన్నాడీఎంకే ఎమ్మెల్యే, తమిళ సినీ హాస్యనటుడు కరుణాస్‌ మీడియాకు తెలిపారు. ఈస్వాగత సంబరాల్లో జయ అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొంటారన్నారు

తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, నటి కుష్బు సోమవారం అపోలో ఆసుపత్రికి చేరుకుని సీఎం ఆరోగ్యం పరిస్ధితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీపావళిలోగా సీఎం క్షేమంగా ఇంటికి చేరుకుంటారని, ప్రజలతో కలిసి పండుగ చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో కుష్బు అన్నారు. ఆమె రాక కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో గానో ఎదురుచూస్తున్నారని కుష్బు తెలిపారు.

online news portal

జయలలిత గత నెల 22న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నెల రోజుల నుంచి ఆమె చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు వినిపించాయి. ఆమెను ఎవరికీ చూపించకపోవడం, చికిత్స పొందుతున్న ఫొటోలను విడుదల చేయకపోవడం జనాల్లో అనుమానాలను మరింత పెంచింది.

online news portal

నేతల పరామర్శలు, డాక్టర్ల రాకపోకలు ఇలా ప్రతీరోజూ పెద్ద హైడ్రామానే నడిచింది. వైద్యులు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్స్ కూడా ఎప్పుడూ ఒకేలా వస్తుండటంతో అనుమానాలను రెట్టింపు చేసింది.జయలలిత కోలుకుంటున్నారని, కొద్దిరోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పడంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది.

- Advertisement -