సీటీమార్.. జ్వాలారెడ్డిగా తమన్నా

437
Tamanna
- Advertisement -

కొత్త హీరోయిన్లకు ధీటుగా తన కెరీర్ ను కొనసాగిస్తుంది తమన్నా. పలు సినిమాల్లో ఐటెం సాంగ్ లు, వైవిధ్యమైన పాత్రలతో బిజీగా ఉంది. ఇటివలే మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఐటెం సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమన్నా ప్రస్తుతం గోపిచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ మూవీలో నటిస్తుంది. దర్శకుడు సంపత్ నంది ఈమూవీని తెరకెక్కిస్తున్నారు.

ఈమూవీలో తమన్నా కబడ్డి టీమ్ కోచ్ గా కనిపించనుంది. తాజాగా ఈమూవీకి సంబంధించి తమన్నా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. జ్వాలారెడ్డి అనే పాత్రలో తమన్నా కనిపించనుంది. ఒక ఫైర్ .. కబడ్డీ కోచ్ అయితే ఇలా ఉంటుంది’ అంటూ ఈ చిత్ర బృందం ఈ ఫస్టులుక్ ను షేర్ చేసింది. గోపించంద్ , తమన్నా, సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కిన గౌతమ్ నంద మూవీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈమధ్య గోపిచంద్ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతండటంతో ఈమూవీపై భారీగా అశలు పెట్టుకున్నాడు.

- Advertisement -