తమన్నా వేసుకున్న అత్యంత ఖరీదైన వస్త్రాలు..

25
Tamannaah

బాహుబ‌లి త‌ర్వాత మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మెగాస్టార్ చిరంజీవి ప్ర‌తిష్టాత్మక ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో నటిస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ రూపొందుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన నాయికగా నయనతార నటించగా, మరో ముఖ్యమైన యువరాణి పాత్రలో తమన్నా నటిస్తోంది.

తాజాగా ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ సినిమా కథా నేపథ్యం కారణంగా తెరపై విభిన్నమైన వేషధారణతో కనిపించనుందట తమన్నా. యువరాణిగా కీలక పాత్ర పోషించ‌నున్న ఆమె తొలిసారి అత్యంత ఖరీదైన దుస్తులు ధరించింద‌ట‌.

Tamannaah

నా పాత్రకి తగినట్టుగా నేను భారీ లెహెంగాలను ధరించాను. నేను ధరించిన వస్త్రాలను చిరంజీవి కుమార్తె సుస్మిత.. ప్రముఖ డిజైనర్ అంజూ మోదీతో కలిసి డిజైన్ చేశారు. సినిమా పరంగా నేను ఇంతవరకూ ధరించిన అత్యంత ఖరీదైన వస్త్రాలు ఇవే. నా వస్త్రధారణ నా పాత్రకి మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది.

ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. నా పాత్ర కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది” అంటోంది ఈ మిల్కీ బ్యూటీ. ఇక ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్, సుదీప్ , జ‌గ‌ప‌తి బాబు ప్ర‌త్యేక పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నార‌ని సమాచారం.