మాస్ సాంగ్ కోసం తమన్నా వెయిటింగ్‌..!

306
Tamanna itam song

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్‌కు చేరుకుంది.

Tamanna

ఈ చిత్రంలో అందాలతార తమన్నా ఓ స్పెషల్ సాంగును చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పాటను వచ్చే నెల మొదటి వారంలో సెట్స్ లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై తమన్నా చెబుతూ, ‘నేను ఓ మాస్ పాటకు డ్యాన్స్ చేసి చాలా రోజులైంది. అందుకే ఈ పాట కోసం ఎదురుచూస్తున్నాను. పైగా దేవిశ్రీ ట్యూన్ అంటే మరీ హుషారు వచ్చేస్తుంది’ అని చెప్పింది.