కూతురిపై కొడుకు అత్యాచారం చేస్తే.. తల్లి తాయత్తు కట్టింది..

270
Talk On Good And Bad Touch, Girl Revealed Abuse On Her By Brothe
- Advertisement -

అన్నయ్య అంటే చెల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత. కానీ ఆ అన్నయ్యనే చెల్లి పాలిటా.. మృగంలా మారాడు. సొంత చెల్లిపైనే పలుమార్లు అత్యాచారం చేశాడు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటన పంజాబ్ లో జరిగింది. వివరాలోకి వెళితే… పంజాబ్ లోని ఖరార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ కుటుంబం వలస వచ్చి అక్కడే నివాసం ఉంటుంది. ఈ దంపతులకు పదకొండు మంది సంతానం. అందరిలో చిన్న కూతురు 3వ తరగతి చదువుతోంది. ఈ 11 ఏళ్ల చెల్లిలిపై తన 22 ఏళ్ల అన్నయ్య అత్యాచారం చేశాడు.

Talk On Good And Bad Touch, Girl Revealed Abuse On Her By Brother

ఆ రోజే అన్నయ్య తనను అత్యాచారం చేశాడని తల్లికి చెబితే.. తన కొడుకు, చెల్లిపై అత్యాచారం చేయడం ఏంటని నమ్మలేదు. మంత్రగాడిని తీసుకువచ్చి కూతురికి గాలి సోకిందని తాయత్తు కట్టించింది. అదే అలుసుగా తీసుకున్న కొడుకు తన చెల్లిని లైంగికంగా వేధిస్తునే ఉన్నాడు. ఇదే క్రమంలో ఒక రోజు తల్లి ప్రత్యక్షంగా చూడగా.. అసలు విషయం బయటపడింది. కొడుకు చేసిన పాడు పనికి తల్లి ఇంట్లో నుంచి గెంట్టేసింది. బయట ఎవరికి చెప్పవద్దని, చెబితే మన పరువు పోతుందని కూతురికి నచ్చ చెప్పింది.

నిజం నిప్పులాంటిది ఎప్పుడైనా తెలియకుండా ఉండదు అనే సామెత పెద్దలు ఊరుకే అనలేదు. అలాగే ఒకరోజు బాధితురాలు చదువున్న స్కూల్లో లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇదే క్రమంలో తనపై తన అన్న చేసిన అత్యాచారాన్ని స్నేహితులకు చెప్పింది. ఈ విషయం విద్యార్థుల నుంచి టీచర్లకు తెలియగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

- Advertisement -