తెలంగాణ పోలీస్ అంటే ఇది: తలసాని, పుట్ట మధు

43
putta madhu

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తెలంగాణ పోలీస్ అంటే ఇది అన్నారు. దిశా విషయంలో పదే పదే విమర్శించారని కానీ అది తప్పని తెలిపోయిందన్నారు. కేసీఆర్ మౌనాన్ని చాలామంది తక్కువగా అంచనా వేశారని…కేసీఆర్‌కు ఉగ్రరూపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికి అర్దమైందన్నారు. ఇప్పటికైనా అకృత్యాలకు పాల్పడే వారు,గుండాయిజం చేశావారికి ఇదో హెచ్చరిక అన్నారు. సంఘ వ్యతిరేక చర్యలను ప్రభుత్వం ఎప్పటికి సమర్ధించదని తెలిపారు.

Minister Talasani Srinivas

దిశను హత్య చేసిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో యావత్ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు. మంథని అంబేద్కర్ చౌరస్తాలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. సిఎం కెసిఆర్‌ని అంతా అభినందిస్తున్నారని…తక్కవ రోజుల్లోనే నిందితులకు పోలీసులు సరైన శిక్ష విధించారని చెప్పారు.