హీరోయిన్ తాప్సీకి గాయాలు..!

238
Taapsee Pannu
- Advertisement -

హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గేమ్‌ ఓవర్‌. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సౌత్‌లో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్న తాప్సీ, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొంటున్నారు. మీడియా ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియాలోనూ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి వరుసగా ఆన్‌లోకేషన్‌ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ సినిమాకు భారీ క్రేజ్ తీసుకొస్తున్నారు. తాజాగా తాప్సి తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె చేతికి తీవ్ర గాయమైనట్టు, రెండు కాళ్లకు కట్లు కట్టుకున్నట్టుగా ఈ ఫొటోలు కనిపిస్తున్నాయి. ఆమె ఎడమ చేయ్యంతా ఎర్రగా కందిపోయి ఉంది.

అయితే ‘గేమ్‌ ఓవర్‌’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆమె, అందులో భాగంగానే ఈ ఫోటోలను విడుదల చేసిందా? లేక నిజంగానే ప్రమాదం జరిగి గాయపడిందా? అన్న విషయమై స్పష్టత లేదు. ఇక ఈ ఫొటోకు క్యాప్షన్ గా “మంచు కొండల్లో షిఫాన్‌ చీరలు కట్టుకుని ఇరవై ఐదు రోజుల పాటు చిత్రీకరణ చేయడం చాలా కష్టం. అందుకే నేను వీటిని ఎంచుకున్నాను” అని తాప్సీ పేర్కొంది. ఈ ఫోటోల్లో కనిసించే గాయలు నిజమైనవా.. కాదా అనే విషయంపై క్లారిటీ రావల్సివుంది.

- Advertisement -