‘శభష్‌ మిథు’.. ఆకట్టుకుంటున్న తాప్సీ..!

446
- Advertisement -

టాలీవుడ్‌,బాలీవుడ్‌లలో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. గతంలో బాలీవుడ్‌లో భారత క్రికెటర్ ఎంఎస్‌ ధోనీ బయోపిక్‌ ప్రేక్షకుల వచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం కపిల్‌దేవ్‌పై కూడా ఓ బయోపిక్‌ 83 అనే మూవీ తెరకెక్కిస్తున్నారు.

కాగా భారత మహిళ క్రికెటర్‌,తెలుగమ్మాయి మిథాలీ రాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘శభష్‌ మిథు’ అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వయాకామ్ 18 నిర్మాణంలో రూపొందుతున్న‌ ఈ చిత్రంలో మిథాలీ రాజ్‌ పాత్రలో తాప్సీ న‌టిస్తుంది. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాఖియా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్టర్  విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో తాప్సీ .. మిథాలీ పాత్ర‌లో ఒదిగిపోయింది. స్టైలిష్ షాట్ కొడుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. 2021 మేలో చిత్రాన్ని విడుద‌ల కానుంది. మ‌హిళా ప్రపంచ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి అంద‌రి దృష్టిని ఆకర్షించిన లేడీ క్రికెట‌ర్ మిథాలీ రాజ్. తెలుగ‌మ్మాయి అయిన మిథాలీ క్రికెట్‌‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డ్ సాధించింది. భార‌త్ క్రికెట్‌కి ఎన‌లేని సేవ‌లందించిన ఆమె జీవిత చరిత్ర బ‌యోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Shabaash Mithu

- Advertisement -