ప్రేమ, పెళ్లి గురించి చెప్పేసిన తాప్సి.

207
taapsee pannu

క్రికెటర్లు, సినిమా వాళ్ల వ్యక్తి గత జీవితంపై సోషల్ మీడియాలో నిత్యం పలు వార్తలు వస్తునేఉంటాయి. హీరోయిన్ తాప్సి గురించి కూడా చాలా రూమర్స్ వచ్చాయి. కొద్దిరోజుల క్రితం ఓ క్రికెటర్ తో తాప్సీ ప్రేమాయణం సాగించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాజాగా తన ప్రేమ విషయానికి సంబంధించిన విషయాన్ని అభిమానులకు చెప్పేసింది తాప్సి..

తాప్సి మాట్లాడుతూ..ఇది అబద్దం కాదు.. నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న వారికోసం చెబుతున్నానంటూ తన ప్రేమ విషయం చెప్పింది. తన జీవితంలో ఉన్న వ్యక్తి అందరూ అనుకుంటున్నట్లుగా నటుడో, క్రికెటరో కాదని.. కనీసం అతడు మన చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా లేడని చెప్పింది.

ఇక పెళ్లి గురించి చెబుతూ తనకు పిల్లలు కావాలి అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నా వల్లే తాప్సి కి అతను పరిచయం అయ్యాడని తాప్సి బ్రదర్ చెప్పాడు. ఈవిషయంలో తాప్సి తనకు ధ్యాంక్స్ చెప్పాలని నవ్వుతూ అడిగాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న తాప్సి ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటివలే బాలీవుడ్ లో మిషన్ మంగళ్ సినిమాలో నటించిన సక్సెస్ ను అందుకుంది.