ఎగ్జిట్ పోల్స్ : ఢీలా పడ్డ టీకాంగ్రెస్..!

308
uttamkumar reddy
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల షాక్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్‌కు సార్వత్రిక ఎన్నికలు కూడా నిరాశనే మిగల్చనున్నాయనే వార్తలతో నైరాశ్యంలో పడింది క్యాడర్. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లాయి ఎగ్జిట్ పోల్స్. దీంతో సర్వేలు నిజమైతే తమ పరిస్థితి ఏంటా అని ఆలోచనలో పడ్డారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బాగానే కష్టపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీనియర్ నేతలు బరిలో ఉండటంతో ఈసారి కాంగ్రెస్‌ మెరుగైన స్ధానాలు దక్కించుకోవడం ఖాయమని క్యాడర్ భావించింది. దీనికితోడు రాష్ట్ర స్ధాయి నేతలు,చివరికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ సైతం తమ సొంతనియోజకవర్గాలకే పరిమితమై ఎన్నికల రణరంగంలో దిగారు. ఎన్నికల అనంతరం అదే ఊపును కొనసాగిస్తూ 17 స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కానీ వారి ఆశలను ఆవిరిచేస్తూ సర్వేలు వ్యతిరేకంగా రావడంతో పరిస్థితి ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కనీసం మల్కాజ్‌గిరి, భువనగిరి, చేవేళ్ల స్థానాల్లో పాగా వేస్తామని భరోసాగా ఉన్నా ఆస్ధానాల్లో గులాబీ పార్టీదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ తెలపడంతో కాంగ్రెస్‌ నేతలను తీవ్ర నిరాశకు గురిచేశాయి.

అనేక జాతీయ ఛానెళ్లు కాంగ్రెస్‌కు ఒక్క స్థానమే కట్టబెట్టాయి. దీంతో ఆ స్థానమేంటనే దానిపై ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో పాటు ఈ ఎగ్జీట్ పోల్స్ నిజమైతే తెలంగాణలో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డట్లేనని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు సీనియర్ నేతలు. మొత్తంగా దేశవ్యాప్తంగా వీస్తున్న వ్యతిరేక పవనాలతో కాంగ్రెస్‌ పరిస్థితి వెంటిలెటర్‌పై ఉన్న పేషెంట్‌లా తయారైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -