స్వచ్ఛత ఎక్సలెన్సీ@జీహెచ్‌ఎంసీ

208
ghmc
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌కు మరో అవార్డు వరించింది.జీహెచ్‌ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును ప్రకటించింది కేంద్ర స్వచ్చ భారత మిషన్ . 10 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీలలో కేవలం హైదరాబాద్ కు మాత్రమే ఈ పురస్కారం దక్కింది.

ఇటీవలే నగరానికి ఓడిఎఫ్‌ ప్లస్‌ను స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించగా తాజాగా 10 రోజుల వ్యవధిలోనే స్వచ్చత ఎక్సలెన్సీ అవార్డు లభించింది. భాగ్యనగరానికి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కడం పట్ల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షన్ 2019లోనూ మంచి ర్యాంకింగ్ సాధిస్తామని స్పష్టం చేశారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ .

బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆయా వ్యర్ధాలను శాస్త్రీయంగా శుద్ధి చేసేందుకు కృషిచేస్తోంది జీహెచ్ఎంసీ. పారిశుధ్యంతో పాటు ప్రజారోగ్యం,ఇతర అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకరావడం,ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకరావాలనే లక్ష్యంతో ఈ మిషన్ ఏర్పాటు చేశారు.

- Advertisement -