ఎస్‌.వి.ఆర్ మీడియా నిర్మాణంలో ఐదు చిత్రాలు..!

28

ఎస్‌.వి.ఆర్ మీడియా బ్యాన‌ర్‌పై త‌మిళంలో విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల‌ను తెలుగులోకి అనువ‌దించిన నిర్మాత శోభారాణి. ఇప్పుడు నిర్మాణ సంస్థ ఎస్‌.వి.ఆర్‌.మీడియా కొత్త టర్న్ తీసుకుంది. ఈ సంస్థ ఇప్పుడు తెలుగులో స్ట్ర‌యిట్ సినిమాల‌ను నిర్మించ‌నుంది. 2020లో ఐదు సినిమాల‌ను ఎస్‌.వి.ఆర్ మీడియాలో నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు శోభారాణి. యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ యంగ్ హీరోలు, హీరోయిన్‌ల‌తో పాటు కొత్త వారితో ఈ సినిమాల‌ను నిర్మించ‌డానికి ఎస్‌.వి.ఆర్ మీడియా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా కొత్త న‌టీన‌టులు, టెక్నీషియన్స్ కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా.. ఎస్‌.వి.ఆర్ మీడియా అధినేత్రి శోభారాణి మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు మేం అనువాద సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ద‌గ్గ‌రయ్యాం. ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు సినిమాల‌ను నిర్మిస్తున్నాం. అందులో భాగంగా 2020లో ఐదు సినిమాల‌ను నిర్మించ‌బోతున్నాం. యంగ్ హీరోలు, హీరోయిన్‌ల‌తో పాటు కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌బోతున్నాం. ఇప్ప‌టికే ఐదు సినిమాల‌కు సంబంధించిన స్క్రిప్ట్స్ సిద్ధ‌మ‌య్యాయి.

అందుకోసం ఆస‌క్తిగ‌త న‌టీన‌టులు(హీరో, హీరోయిన్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్స్‌), సాంకేతిక నిపుణులకు ఆహ్వానం ప‌లుకుతున్నాం. ఆస‌క్తిగ‌ల‌వారు starmaking2020@gmail.com or to the WhatsApp no.s 9000910979-9133673367 ల‌కు వారి ప్రొఫైల్స్‌ను పంపాల్సిందిగా కోరుతున్నాం. ఆస‌క్తి, నైపుణ్యం గ‌ల న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు ఇదొక మంచి ప‌రిణామంగా భావిస్తున్నాం“ అన్నారు.