అల వైకుంఠపురములో సుశాంత్ !

334
sushanth

అల వైకుంఠపురములో సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

అల్లు అర్జున్- త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అల వైకుంఠపురంలో మ్యూజిక్ ట్రీట్‌కి అంతా ఫిదా అయిపోయారు. సామజవరగమన అంటూ యూ ట్యూబ్‌ని షేక్ చేశాడు తమన్.

దీపావళి కానుకగా సెకండ్ సింగిల్‌ని విడుదల చేయనుంది చిత్రయూనిట్. రాములో రాములా అనే సాంగ్‌ని దీపావళికి విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను అల్లు అరవింద్, కె.రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.