హుజూర్‌నగర్ ఎగ్జిట్‌ పోల్స్‌.. TRSదే గెలుపు..

518
trs
- Advertisement -

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే ప్రముఖ సర్వే సంస్థ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన సర్వే రిపోర్టును వెల్లడించింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండాపోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్టు సమాచారం.

పోలింగ్‌ అనంతరం విడుదైన ఎగ్జిట్‌ పోల్స్‌ టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపుతున్నాయి. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌దే విజయమని ఆరా సర్వే సంస్థ ప్రకటించింది. టీఆర్‌ఎస్‌కు 50.48 శాతం,కాంగ్రెస్‌కు 39.95శాతం,ఇతరులకు 9.57శాతం విజయవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. హుజూర్‌నగర్‌లోని అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌కే ఆధిక్యమని తమ సర్వేలో తేలినట్టు ఆరా తెలిపింది. టీఆర్‌ఎస్‌ 15 వేల మెజారిటీతో విజయం సాధిస్తుందని నాగన్న సర్వే ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ 52-52 శాతం, కాంగ్రెస్‌ 42-45శాతం, బీజేపీ 4-6 విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిది.

- Advertisement -