రెండుగా చీలిన ఎన్సీపీ..!

671
ncp
- Advertisement -

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఉహించని ముగింపు లభించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మహారాష్ట్రాలో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా ఇది ప్రస్తుతం ఎన్సీపీలో చీలికకు దారితీసింది.

ఎన్సీపీ తరపున 56 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందగా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్‌కు మద్దతుగా 22 మంది ఎమ్మెల్యేలు నిలిచారు.మరోవైపు అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయంతో ఎన్సీపీకి సంబంధంలేదని ఇప్పటికే శరద్ పవార్ స్పష్టం చేశారు.

ఇక ఈ వార్తలకు బలం చేకూరేలా ఎన్సీపీ సీనియర్ నాయకురాలు,శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సొలే వాట్సాప్ స్టేటస్ ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ,ఫ్యామిలీ రెండుగా చీలిపోయిందని ఆమె చేసిన ప్రకటన ఎన్సీపీలో కలకలం రేపుతోంది.

మరోవైపు అజిత్ పవార్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతోంది శివసేన. అజిత్ పవార్ తమను వెన్నుపోటు పొడిచారని…నిన్నటివరకు తమతోనే ఉన్న ఆ మహాశయుడు(అజిత్ పవార్‌) అనుకోకుండా మాయమై పోయారని చెప్పారు. అజిత్ పవార్,ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు చత్రపతి శివాజీ సిద్దాంతాల్ని అవమానించారని దుయ్యబట్టారు.

Supriya Sule, Senior NCP leader and daughter of Sharad Pawar’s latest Whatsapp status,her office confirms statement as well

- Advertisement -