జస్టిస్ కర్ణన్ కు సుప్రీం షాక్‌..

215
Supreme Court rejects urgent hearing on Justice ...
- Advertisement -

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై జారీచేసిన అరెస్టు ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కర్ణన్‌ చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.  అయితే తాను చేసిన దానికి బేషరతుగా క్షమాపణ చెబుతానని సుప్రీంకోర్టును ప్రాధేయపడినా… ఆ విన్నపాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. అరెస్టు ఆదేశాలను వెనక్కి తీసుకోబోమని తేల్చి చెప్పింది.
 Supreme Court rejects urgent hearing on Justice ...
అంతేకాదు, కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ‘విలువైన కోర్టు సమయాన్ని మీరు వృథా చేస్తున్నారు. పిటిషన్‌ వచ్చినప్పుడు విచారణ చేస్తాం కదా’ అంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు ధిక్కార కేసులో జస్టిస్‌ కర్ణన్‌ను వెంటనే అరెస్టు చేసి, జైలు శిక్ష అమలు చేయాలని కోల్‌కతా పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

అయితే కోర్టు తీర్పుకు కొద్ది గంటల ముందే కోల్‌కతా విడిచి వెళ్లిన జస్టిస్‌ కర్ణన్‌ అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. ఆయన చెన్నైలోనే ఉన్నారని జస్టిస్‌ కర్ణన్‌ తరఫు న్యాయవాది చెబుతున్నప్పటికీ.. ఆయన మాత్రం పోలీసులకు దొరకడంలేదు.ఆయన ఆచూకీ కోసం తమిళనాడు, బంగాల్‌ రాష్ట్రాల పోలీసులు విస్త్రత గాలింపు చేపట్టారు.

- Advertisement -