చిదంబరానికి బెయిల్ మంజూరు..

67
chidhambaram

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజి మంత్రి చిదంబరానికి ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేడు సుప్రీంకోర్టు చిదంబ‌రానికి బెయిల్ మంజూరీ చేసింది. చిదంబరం లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

గతంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో.. మాజీ కేంద్ర మంత్రి బెయిల్ కోసం సుప్రీం సుప్రింను ఆశ్రయించారు. దర్యాప్తు సంస్థల విచారణకు సహకరించాలని ఆయనను సుప్రీం ఆదేశించింది. ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్ చేసిన సిబిఐ ప్రస్తుతం ఆయను ఈడీ కస్టడీలో ఉంచారు.