రజనీ నెక్ట్స్‌ మూవీ టైటిల్ ఫిక్స్‌..!

627
Thalaivar 168
- Advertisement -

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవలే ‘దర్బార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ మంచి వసూళ్లతో జోరును కొనసాగిస్తోంది, ఇదిలావుంటే తలైవా తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా వున్నారు. ఆయన 168వ త్వరలో సెట్స్‌పైకి రానుందట. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘అన్నాత్త’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించవలసి వుంది.

rajini

దర్శకుడు శివ అజిత్ హీరోగా వరుసగా నాలుగు సినిమాలు రూపొందించాడు. అంతేకాదు సూర్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే రజనీతో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. రజనీకాంత్ సరసన ఖుష్బూ .. మీనా నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నారనీ, కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల్లో ఒకటి ఆయన ఈ సినిమాలో చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం.

- Advertisement -