ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో మహేశ్ బాబు

23
Mahesh Babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు మహర్షి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన తర్వాతి మూవీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉండనుంది. ఇక మహేశ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షిస్తున్నారు.

ఆయనతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. క్రికెట్ అంటే ఇష్టమే అయినా మహేశ్ స్టేడియంకు వచ్చి మ్యాచ్ లు చూడడం ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. మా అబ్బాయి కోసం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కు వచ్చానంటూ మహేశ్ తన సెల్ఫీకి క్యాప్షన్ పెట్టాడు. దీన్ని మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేయగా, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.