రేపటి మహర్షులతో మహర్షి..(వీడియో)

69
mahesh babu With Hps School

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈమూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈసినిమాను దిల్ రాజు, అశ్వినిదత్, పీవీపీలు నిర్మించారు. మహేశ్ కెరీర్ లోనే ఈమూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయిందనడంతో సందేహం లేదు. మహర్షి ఘన విజయం సందర్భంగా ప్రతి రోజు అభిమానులతో ముచ్చటిస్తున్నారు మహర్షి చిత్రయూనిట్.

ఈసందర్భంగా నిన్న ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయం చేస్తున్న యువకులతో ముచ్చటించారు మహేశ్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి. తాజాగా నిన్న రాత్రి స్కూల్ పిల్లలతో సరదాగా ముచ్చటించారు. బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలతో కాసేపు సినిమా గురించి మాట్లాడారు. చిన్న పిల్లలు అడిగిన ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధానం ఇచ్చారు. కొంతమంది చిన్న పిల్లలు అడిగిన ప్రశ్నలకు మహేశ్ ఫిదా అయిపోయారు. తాజాగా చిత్ర యూనిట్ ఇంటర్వూ ప్రోమోను విడుదల చేశారు.