మెస్మరైజింగ్‌ లుక్‌లో మహేష్‌..!

255
Super Star Mahesh Babu New Look
- Advertisement -

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు రోజురోజుకు మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు. తాజాగా తన భర్త, మహేష్‌ బాబు, కుమారుడు గౌతమ్, కూతురు సితారలకు సంబంధించిన ఓ ఫొటోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో మహేష్‌ చాలా యంగ్‌ లుక్‌లో కపడుతున్నాడు. కళ్లజోడు పెట్టుకుని ఆయన ఇచ్చిన పోజుకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆయన మరింత యంగ్‌గా మారిపోయాడని కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే మహేష్ తనయుడు గౌతమ్ టీనేజీలో అడుగు పెట్టేశాడు. అతడికి అన్న ఉంటే అచ్చం ఇలానే ఉంటాడేమో! అన్నట్టుగా ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు మహేష్. ఇంతలోనే ఎంత మార్పు. కేవలం 45 రోజుల లాక్ డౌన్ కే ఇంత మార్పు చూపించాడు? మరో 45 రోజుల లాక్ డౌన్ విధిస్తే ఇంకేమవుతాడో? మరోసారి కాలేజ్ బోయ్ పాత్రలో నటించబోతున్నాడా? అన్న సందేహం అభిమానుల్ని వెంటాడేస్తోంది. ఇన్ స్టాలో నమ్రత ఈ ఫోటోని షేర్ చేయగానే ఇదే సందేహం అటు నెటిజనులు వ్యక్తం చేశారు. గౌతమ్ కి అన్నయ్యలా ఉన్నావు! అంటూ మహేష్ కి కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు.

- Advertisement -