“మహర్షి” మూవీ రివ్వూ..

746
Maharshi
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మహర్షి. మహేశ్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ.. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈమూవీ ధియేటర్లలోకి వచ్చింది. మహేశ్ కెరీర్ లో ఇది 25 వ మూవీ కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుఝామునే బెనిఫిట్ షోలు వేశారు. అన్ని ఏరియాల నుంచి మహర్షి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. మహేష్ బాబు మూడు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టాడని, వంశీ పైడిపల్లి సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం ఎమోషనల్‌గా రూపొందించినట్లు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ‘మహర్షి’ కథ అద్భుతంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రిమియర్ షో లు చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉంది..బ్లాక్ బాస్టర్ హిట్ అని చెబుతున్నారు. మరి మహర్షి మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.
కథః

రుషి కుమార్ (మ‌హేష్ బాబు) ఓ కంపెనీకి సీఈఓ. ఓడిపోవ‌డం అంటే ఏమిటో తెలియని బిజినెస్ మేన్‌. త‌న క‌ష్టాన్నీ, క‌ల‌ల్ని, విజ‌యానికి సోపానాలుగా మ‌ల‌చుకున్న వ్య‌క్తి. కాలేజ్‌ కుర్రాడిగా ఉన్న సమయంలో అతడు ఎదుర్కొన్న సంఘర్షణల నుండి ఒక ప్రపంచ స్థాయి కార్పోరేట్‌ కంపెనీకి అధినేత ఎలా ఎదిగాడు, అందుకు ప్రేరేపించిన కారణాలు ఏంటీ అనేది ఈ చిత్రం కథగా చెప్పుకోవచ్చు.. వేల కొట్లు సంపాదించిన రిషి ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూసుకుంటే అతని జీవితంలో చాలా మిస్ అవుతాడు. త‌న విజ‌యాలు త‌నొక్క‌డి క‌ష్టానికి వ‌చ్చిన ప్ర‌తిఫ‌లాలు కాదని, వాటి వెనుక త‌న స్నేహితులు (పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్‌) క‌ష్టం, త్యాగం కూడా ఉన్నాయ‌ని గ్ర‌హిస్తాడు. అతను పోగొట్టుకున్న ఆనందం కోసం తన ఫ్రెండ్ అల్లరి నరేష్ ఉరికి వెళ్తాడు. డబ్బు సంపాదించడమే విజయం సాధించిన రిషి..పల్లెటూరికి వెళ్లి ఏవిధంగా విజయం సాధిస్తాడన్నడే ఈసినిమా కథ.

నటీనటుల నటనః
సినిమాలో మహేశ్ బాబు నటన చాలా అద్బుతం. రిషి క్యారెక్టర్ లో ఆయన చాలా బాగా నటించారు. అతని నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈమూవీలో మహేశ్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. ఒక టుక్ లో సీఈఓగా స్టైలిష్‌గా క‌నిపించిన మ‌హేష్ మరో లుక్ లో విద్యార్థిగా మాస్‌ని అల‌రిస్తాడు. ఇంక మరో లుక్ లో బిజినెస్ మ్యాస్ గా అందరి మనసును దోచేశాడు. రైతు స‌మ‌స్య‌లపై పోరాటం చేస్తున్న‌ప్పుడు త‌న‌లోని సిన్సియారిటీ క‌నిపిస్తుంది.

ఇక అల్లరి నరేష్ కు ఈసినిమాలో మంచి పాత్రలో నటించాడు. మహేశ్ బాబు ఫ్రెండ్ క్యారెక్టర్ లో విలేజ్ నుంచి వచ్చిన అబ్చాయిలా అద్భుతంగా నటించాడు. స్క్రీన్‌ ప్రజెన్స్‌ కాస్త తక్కువ ఉన్నా కూడా ఉన్నంతలో అల్లరి నరేష్‌ మెప్పించాడు. నరేష్ ఈమూవీలో నటించడం వల్ల ఆయన కెరీర్ కు ఇది ఫ్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి.

ఇక పూజా హెగ్డె తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులు చేసింది. కేవలం ఆమెను గ్లామర్ కే పరిచయం చేయకుండా క‌థానుసారం ఆ పాత్ర‌కూ ప్రాధాన్యం ఇచ్చారు. కాలేజ్‌ సన్నివేశాల్లో చిలిపిదనంతో ఆకట్టుకున్న పూజా పాటల్లో మరింత గ్లామర్‌గా కనిపించింది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గురించి మనం చెప్పుకోనక్కర్లేదు. ఆయన ఈసినిమాకు ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కొర్ సినిమాకు హైలెగ్ నిలిచాయి. ముఖ్యంగా శ్రీమణి సాహిత్యం పాటలకు అదనపు బలాన్ని ఇచ్చింది. ఈమూవీతో మరోసారి దేవి తన సత్తాను చాటుకున్నారని చెప్పుకోవాలి.

వంశీ పైడిపల్లి చాలా కేర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. టేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మహేశ్ బాబు రేంజ్ తగ్గకుండా ఈసినిమాను తెరకెక్కించారు. తాను అనుకున్న విధంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. మహేశ్ లాంటి పెద్ద స్టార్ తో అనుకున్న విధంగా సినిమా తీయండం మాములు కాదని చెప్పుకోవాలి. కానీ వంశీ పైడిపల్లి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారని చెప్పుకోవాలి.

తీర్పుః
భారీ అంచనాలతో తెరకెక్కిన ఈసినిమాను మహేశ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అందులో మహేశ్ బాబుకు ఇది 25వ సినిమా కావడం ఆయనకు స్పెషల్ అని చెప్పుకోవాలి. చాలా విభిన్నమైన నేపథ్యం కాకున్నా కూడా రెగ్యులర్‌గా ఉన్నా స్క్రీన్‌ప్లే మాయాజాలంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. అయితే సినిమాలో ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటే బాగుండేది. మాస్ , క్లాస్ అభిమానులు థియేటర్లలోకి వచ్చేలా సినిమాను తీశాడు వంశీ పైడిపల్లి. మొత్తానికి మహేశ్ అభిమానులు పండగ చేసుకునే ఈసినిమా అని చెప్పుకోవాలి. సమ్మర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ గా ఈమూవీ నిలుస్తుందని చెప్పడంతో ఎటువంటి సందేహం లేదు. విడుదలకు ముందే రూ.150 కోట్ల బిజినెస్ చేసిన ఈమూవీ మరెన్ని కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.

పాజిటివ్ పాయింట్స్: 

కథ

నటీనటులు

డైలాగ్స్

ఫోటోగ్రఫి

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్: 

ఎక్కువ నిడివి

విడుదల తేదీ: 09-05-2019
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: దిల్ రాజు, అశ్వీనిదత్, పీవీపీ
రచన – దర్శకత్వం: వంశీ పైడిపల్లి

రేటింగ్ః 3.5/5

- Advertisement -