ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది..

440
WARNER-IPL
- Advertisement -

ఐపీఎల్ 13వ సీజన్ మర్చి 29న ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగనుంది. మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ట్వీట్టర్ ద్వారా హైదరాబాద్ మ్యాచ్ లను ప్రకటించింది.

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 1న ముంబయి ఇండియన్స్ తో సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. మొత్తం 14 మ్యాచ్‌ల వివరాలను సన్‌రైజర్స్ తన ట్విట్టర్‌ పేజ్ లో పోస్టు చేసింది. చివరి లీగ్ మ్యాచ్ మే 17న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్‌లో జరుగుతుంది. మే 24న ఫైనల్‌ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో లీగ్ మ్యాచులు జరగున్నాయి.

సన్ రైజర్స్ జట్టుః
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బిల్లీ స్టాన్‌లేక్, నటరాజన్, అభిషేక్ శర్మ, షహ్బాజ్ నదీమ్, మిచెల్ మార్ష్, ఫాబియన్ అలెన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సంజయ్ యాదవ్, జాన్ బెయిర్‌స్టో, వృద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి, బసవక సందీప్, బాసిల్ తంపి

- Advertisement -