కూతురితో హైదరాబాద్ లో చక్కర్లు కొట్టిన వార్నర్(వీడియో)

55
davidwarner

సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మాజీ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. నిన్న తెలంగాణలో ఎన్నికలు ఉండటంతో హైదరాబాద్ రోడ్లన్ని ఖాళిగా ఉన్నాయి. దీంతో డేవిడ్ వార్నర్ తన కూతురితో కలిసి నగరంలో చక్కర్లు కొట్టారు. ఆ వీడియోను సన్‌రైజర్స్‌ అధికారిక ట్విట్టర్ ఖాతాలో దాన్ని షేర్‌ చేస్తూ.. ‘హైదరాబాద్‌లో ఇవాళ ఎవరు విహరిస్తున్నారో చూడండీ’ అంటూ పోస్టు చేసింది.

ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌లో జరగనున్న నేపథ్యంలో ప్యాక్టీస్‌కు వార్నర్ కొంత విరామం దొరకడంతో ఇలా కూతురితో కలిసి జంట నగరాల్లో సందడి చేశారు. గతేడాది బాల్ ట్యాపంరింగ్ కేసులో సంవత్పరం పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు వార్నర్. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ లలో తన సత్తాను చాటుతున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లలో అందరి కంటే ఎక్కువ స్కోర్ చేసి పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్ధానంలో ఉన్నాడు డేవిడ్ వార్నర్.